: జైలులో ఒంటరిగా జయలలిత... నిద్రలేమితో సతమతం!
హంసతూలికా తల్పాలపై నిన్నటిదాకా సుఖనిద్ర అనుభవించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు శనివారం రాత్రి బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో కంటి మీద కునుకు లేదట. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడ్డ జయలలితను పోలీసులు శనివారం సాయంత్రం జైలుకు తరలించారు. జైలులోని 23వ నెంబరు గదిలో ఒంటరిగానే జయలలిత రాత్రంతా గడిపినట్లు సమాచారం. తీర్పు వెలువడగానే అస్వస్థతకు గురైన జయలలితను తొలుత ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు అనంతరం ఆమెను జైలుకు తరలించారు. జైలు గదిలో ఒంటరిగా ఉన్న జయ, రాత్రి నిద్రలేమితో బాధపడినట్లు జైలు సిబ్బంది చెబుతున్నారు. రాత్రంతా ఆమె మేలుకునే ఉన్నారని తెలుస్తోంది.