: 'ఢిల్లీ పులి' కోసం త్రిష ఆరాటం
నటి త్రిష జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. రోడ్డు పక్కన కనిపించే మూగజీవాల పట్ల ఆమె ఎంతో కరుణ ప్రదర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జంతువుల కోసం పోరాడే 'పెటా' సంస్థలో త్రిష కూడా ఓ వలంటీర్. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ జూలో ఓ యువకుడు తెల్ల పులి ఎన్ క్లోజర్ లో పడిపోగా, అది అతడిని చంపేసింది. ఇప్పుడా పులిని చంపేయాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సూచనలు చేస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారట. మరికొందరు మాత్రం దానిపై జాలి పడుతున్నారు. అలాంటి వారికి మద్దతుగా త్రిష రంగంలోకి దిగారు. ఆ అరుదైన తెల్ల పులిపై దయ చూపాలంటూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. దానికి క్షమాభిక్ష పెట్టాలని కోరారు. ఈ మేరకు త్రిష ట్విట్టర్లో పేర్కొన్నారు.