: జయ అప్పీలుకు అడ్డంకిగా మారిన దసరా సెలవులు
అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు నాలుగేళ్ళ జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు దసరా సెలవులు అడ్డంకిగా మారాయి. అక్టోబర్ 5 వరకు దసరా, ఇతర పర్వదినాల కారణంగా న్యాయస్థానాలకు సెలవులు ప్రకటించారు. దీంతో, జయ ఆ తర్వాతే పై కోర్టులో అప్పీల్ చేసుకునే వీలుంటుంది. ఈ కేసులో కర్ణాటకలోని కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి, ఆ రాష్ట్ర హైకోర్టులోనే జయ అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అనుకూల తీర్పు రాకుంటే, సుప్రీం కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది.