: బాల్యంలోనే కృష్ణానదిని ఈదింది... ఇప్పుడు ఆసియా క్రీడల్లో సత్తా చాటింది!


ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సత్తా చాటింది. ఆర్చరీ కాంపౌండ్ టీం ఈవెంట్ లో పూర్వాషా షిండే, త్రిషలతో కలిసి కాంస్యం సాధించింది. కాంస్యం కోసం పోరులో జ్యోతి బృందం 224-217తో ఇరాన్ మహిళలపై గెలిచింది. కాగా, విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ బాల్యంలోనే కృష్ణానదిని ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడం విశేషం. అనంతరం, ఆర్చరీపై మక్కువ పెంచుకున్న ఈ తెలుగుతేజం జాతీయస్థాయిలో మెరుపులు మెరిపించింది. ఈ ఏడాది బ్యాంకాంక్ లో జరిగిన సీనియర్ ఆసియా గ్రాండ్ ప్రీలో మూడు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం సాధించి సత్తా చాటింది. తాజాగా, ఆసియా క్రీడల్లో కనబర్చిన ప్రదర్శనకు గాను, జ్యోతికి సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News