: జయ శిక్షపై స్పందించడానికి నిరాకరించిన రాజ్ నాథ్
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షపై మాట్లాడేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిరాకరించారు. జయకు కోర్టు విధించిన శిక్షపై స్పందించాలని కోరిన మీడియాకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. కోర్టు తీర్పుకు సంబంధించి తాను ఎలాంటి కామెంట్ చేయలేనని... ఆ తీర్పును ఇంతవరకు చూడలేదని దాటవేత ధోరణితో సమాధానమిచ్చారు.