: జయకు అంత శిక్ష పడుతుందని నేను ఊహించలేదు: సుబ్రహ్మణ్యస్వామి
రాజకీయవేత్తగా కాకుండా ఓ సామాన్య వ్యక్తిగానే తాను జయలలితపై ఫిర్యాదు చేశానని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. సామాన్యుడు కూడా అవినీతి, అక్రమాలను నిలదీయవచ్చనే దానికి ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు. అయితే, జయకు ఇంత కఠినమైన శిక్ష పడుతుందని తాను ఊహించలేకపోయానని అన్నారు. జయపై ఫిర్యాదు చేసిన తర్వాత తనపై అనేక దాడులు జరిగాయని... అయినా తానెప్పుడూ భయపడలేదని స్వామి చెప్పారు. జయకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో తమిళనాడు అగ్నిగుండంలా మారుతుందని అన్నారు. ఇక జయలలిత శకం ముగిసినట్టేనని తెలిపారు.