: అట్టుడుకుతోన్న తమిళనాడు


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు శిక్ష ఖరారు కావడంతో ఆమె మద్దతుదారులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. తమ అమ్మ నిర్దోషిగా బయటపడుతుందని భావించిన అన్నాడీఎంకే శ్రేణులను కోర్టు తీర్పు షాక్ కు గురిచేసింది. జయకు శిక్షను తట్టుకోలేని మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో, తమిళనాడు మొత్తం అట్టుడుకుతోంది. అన్నాడీఎంకే కార్యకర్తలు కరుణానిధి, సుబ్రహ్మణ్యస్వామిల నివాసాలపై రాళ్లు రువ్వారు. వారి నివాసాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. డీఎంకే శ్రేణులపై అన్నాడీఎంకే వర్గీయులు దాడులకు దిగుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా షాపులను మూయిస్తున్నారు. కాంచీపురంలో ఓ బస్సుకు నిప్పుపెట్టడమే కాకుండా 20 బస్సులను ధ్వంసం చేశారు. రాష్ట్రంలోని పలుచోట్ల బస్సులు ధ్వంసమయ్యాయి. కొద్ది సంఖ్యలో ఉన్న పోలీసులకు అన్నాడీఎంకే కార్యకర్తలను అదుపు చేయడం అసాధ్యంగా మారింది. జయలలిత నియోజకవర్గం శ్రీరంగంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. తమిళనాడులోని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏపీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి బస్సు సర్వీసులను నిలిపివేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి.

  • Loading...

More Telugu News