: పనబాక, వట్టిలకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వనున్న ఆంధ్రా యూనివర్శిటీ
కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ లకు ఆంధ్రా యూనివర్శిటీ డాక్టరేట్లు ప్రదానం చేయనుంది. విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం సందర్భంగా డాక్టరేట్లు ఇవ్వనున్నట్టు యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ జీఎన్ఎన్ రాజు తెలిపారు. సెప్టెంబర్ 29న జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్, ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సలహాదారు కార్యలయంలో ముఖ్య సైంటిఫిక్ కార్యదర్శి రాఘవన్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాఘవన్ కు కూడా డాక్టరేట్ ఇన్ సైన్స్ ను ప్రదానం చేయనున్నారు.