: న్యూయార్క్ మేయర్ తో భేటీ అయిన మోడీ


ఐదు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్ లో సందడి చేస్తున్నారు. న్యూయార్క్ మేయర్ బిల్ డే బ్లాసియోతో సమావేశమయ్యారు. భారత్ లోని పట్టణాలను ఆధునికీకరించాలని భావిస్తున్న మోడీ... పట్టణ ప్రణాళిక, గృహ నిర్మాణం, నగర పోలీసు వ్యవస్థ తదితర అంశాలపై మేయర్ తో చర్చించారు. దీంతో పాటు, నగరాలకు ప్రధాన సమస్యలైన ఉగ్రవాదం, నేరాలు తదితర అంశాలపై కూడా చర్చలు జరిపారు.

  • Loading...

More Telugu News