: కరుణానిధితో అత్యవసర చర్చలు జరిపిన కుమారుడు స్టాలిన్
జయలలిత అక్రమాస్తుల కేసులో తుది తీర్పు వెలువడనున్న క్రమంలో తమిళనాడులో కీలక పార్టీలైన ఏఐఏడీఎంకే, డీఎంకే నేతలు తీవ్ర ఉత్కంఠను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో, డీఎంకే చీఫ్ కరుణానిధిని ఆయన కుమారుడు, ఆ పార్టీలో నెంబర్.2 అయిన స్టాలిన్ కలిశారు. జయకు శిక్ష ఖరారయిన అనంతరం ఎలా స్పందించాలన్న విషయంపై వీరిరువురూ లోతైన చర్చ జరిపారు.