: జ్యుడీషియల్ కస్టడీకి జయలలిత
అమ్మగా, పురచ్చితలైవిగా కోట్లాది తమిళుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న జయలలితను బెంగళూరు ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. రూ. 66 కోట్ల అక్రమాస్తుల కేసులో జయ దోషి అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, జయను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో జయకు కోర్టు శిక్షను ఖరారు చేయగానే... ఆమెను జైలుకు తరలిస్తారు. అయితే, కర్ణాటకలోని జైలులో ఉంచుతారా? లేక తమిళనాడులోని జైలుకు తరలిస్తారా? అనే విషయం కూడా కాసేపట్లో తేలిపోనుంది. జయకు శిక్ష నేపథ్యంలో బెంగళూరులో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వేలాది మంది ఏఐఏడీఎంకే కార్యకర్తలు తరలిరావడంతో బెంగళూరులోని జైలు పరిసర ప్రాంతాలు చైన్నైని తలపిస్తున్నాయి.