: మహారాష్ట్ర ఎన్నికలు: బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలు విడుదల


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ లు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. 172 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. అటు కాంగ్రెస్ కూడా 118 మందితో తొలి జాబితాను, 143 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను విడుదల చేసింది. అటు 288 సీట్లలో పోటీ చేస్తున్న శివసేన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. నేరుగా వెళ్లి పత్రాలను నింపి నామినేషన్ దాఖలు చేయాలని కోరింది. నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఈ రోజు సాయంత్రంతో నామినేషన్ దాఖలు గడువు ముగియనుంది.

  • Loading...

More Telugu News