: ఇప్పటిదాకా మోడీ ఏమాత్రం నిరుత్సాహపరచలేదు: ప్రముఖ ఆర్థిక వేత్త భగవతి
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సరైన దిశలోనే పయనిస్తోందని ప్రముఖ ఆర్థిక వేత్త, కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ జగదీశ్ భగవతి అన్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమాత్రం నిరుత్సాహపరచలేదని ఆయన తెలిపారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఇండియా టుడే గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా భగవతి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గడచిన 120 రోజులను పరిశీలిస్తే, ప్రధాని నరేంద్ర మోడీ సంచలనాలు నమోదు చేశారు. మోడీ సరైన దిశలోనే ప్రయాణిస్తున్నారు. మోడీ సర్కారు నన్ను ఇప్పటిదాకా ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుస్తున్న మోడీ, పేద ప్రజలకు మరింత మేర సేవ చేస్తారనే నమ్మకం నాకుంది’’అని భగవతి అన్నారు.