: రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ శిల్పాశెట్టి
బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి రోడ్డు ప్రమాదమైంది. పంజాబ్ లోని కపూర్తలా ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఒక స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు జలంధర్ నుంచి అమృతసర్ వెళ్తున్న శిల్పాశెట్టి కారును, ధిల్లవాన్ టోల్ ప్లాజా సమీపంలో మరో కారు ఢీకొట్టింది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. ఆమె అంగరక్షకులు కారు డ్రైవర్ తో గొడవకు దిగగా, ఆమె మరో కారులో వెళ్లిపోయారు. పంజాబ్ కు చెందిన రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న శిల్పాశెట్టి, సినీరంగంతో పాటు వ్యాపార రంగంలో కూడా నిలదొక్కుకున్న విషయం తెలిసిందే.