: బెంగళూరుకు బయల్దేరిన జయలలిత
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై నుంచి బెంగళూరు బయలుదేరారు. ఆస్తుల కేసుకు సంబంధించి బెంగళూరు ప్రత్యేక కోర్టులో ఆమె హాజరుకానున్నారు. ఆస్తుల కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో 20 వేల మంది ఏఐఏడీఎంకే కార్యకర్తలు రావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో 2 కంపెనీల బీఎస్ఎఫ్, 30 ప్లటూన్ల పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.