: దేవాలయాలకు కన్నమేసిన దొంగలు
దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. చోరీలకు తెగబడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. తమకు అడ్డొస్తే ఎవరినీ క్షమించడంలేదు, వారి అంతుచూస్తున్నారు. గత నాలుగు రోజుల్లో పదుల సంఖ్యలో దొంగతనాలు నమోదయ్యాయి. తాజాగా దేవాలయాలపై దొంగల కన్నుపడింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, సంగం మండలాల్లోని దేవాలయాలకు దొంగలు కన్నమేశారు. గత రాత్రి ఆరు దేవాలయాల్లోకి చొరబడిన దొంగలు హుండీలు, ఆభరణాలు దోచేశారు. వీటిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.