: కొలీజియం వ్యవస్థే సరైంది...ఇంకో పద్దతి వద్దు: జస్టిస్ లోథా
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థే సరైనదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కొలీజియం వ్యవస్థను కాదని మరో పద్ధతిని పాటిస్తే న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికే విఘాతం కలుగుతుందని అన్నారు. జడ్జిల నియామకంలో అభ్యర్థుల అర్హతలపై సమర్థవంతమైన నిర్ణయం తీసుకోగల సామర్థ్యం జడ్జిలకే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నేడు లోధా రిటైర్ కానున్నారు.