: ఆసియా క్రీడల్లో మహిళల ఆర్చరీకి కాంస్యం
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం వచ్చి చేరింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్ లో భారత్ కు కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ (విజయవాడ), త్రిష డే, పూర్వా షిండే లతో కూడిన ఆర్చరీ జట్టు కాంస్యపతకం కైవసం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో 17 పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ 16 స్థానంలో నిలిచింది. నేడు కొన్ని కీలక విభాగాల్లో జరుగనున్న క్రీడల్లో భారత్ కు పతకాలు వచ్చే అవకాశముంది.