: మనసున్న మారాజు ఆ మామగారు!


కొడుకు మరణించిన తర్వాత కోడలికి పునర్వివాహం చేయించడానికి భారీగా కట్నకానుకలు ఇచ్చి తన గొప్పమనసును చాటుకున్నారు ఓ గుజరాత్ ఎంపీ. గుజరాత్లోని పోర్బందర్ ఎంపీ విఠల్ రాడాడియా ఆ ప్రాంతంలో రైతు నాయకుడు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కల్పేష్ రాడాడియా ఏడు నెలల క్రితం గుండె పోటుతో అకాల మరణంపాలయ్యారు. కల్పేష్ రాడాడియాకు మనీషా అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త జ్ఞాపకాల్లోనే జీవిస్తున్న కోడలికి మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితమివ్వాలని ఎంపీ భావించారు. దీంతో ఆమెకు అండగా నిలబడగలిగే సరైన తోడుకోసం వెతుకులాట ప్రారంభించారు. చివరకు తన చిన్న కుమారుడు లలిత్ రాడాడియా స్నేహితుడైన హర్దిక్ చోవాటియాతో మనీషాకు రాజ్కోట్ జిల్లాలోని జామ్కండోర్నా పట్టణంలో పెళ్లి చేశారు. పెళ్లి కోసం మనీషాకు వంద కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని విఠల్ రాడాడియా ఇచ్చారు.

  • Loading...

More Telugu News