: ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు
జమ్మూ కాశ్మీర్ ను అతలాకుతలం చేసిన వరదలు, ఈసారి ఈశాన్య రాష్ట్రాల వైపు మరలాయి. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎన్ డీఎంఏ తెలిపింది. మేఘాలయ, అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మేఘాలయలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా ఇప్పటికే 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు.