: గాంధీ జయంతి సెలవు రద్దు


గాంధీ జయంతిని ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటాం. కొన్ని చోట్ల స్కూళ్లలో గాంధీపై, స్వాతంత్ర్య సమరయోధులపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. గాంధీ జయంతి రోజున సెలవు తీసుకుని మంచి పని చేయాలని ఉద్బోధిస్తారు. ఈసారి మాత్రం అలా కాకుండా ప్రత్యేకంగా జరపాలని కేంద్రం నిర్ణయించింది. అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును రద్దు చేస్తూ కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. 'స్వచ్ఛ్ భారత్' కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వోద్యోగులంతా విధులకు హాజరు కావాలని కేంద్రం ఆదేశించింది. ఉద్యోగులు ఆ రోజున 'స్వచ్ఛ్ భారత్' కోసం పని చేయాలని సూచించింది. ఇండియా గేట్ వద్ద ప్రధాని మోడీ చీపురుతో శుభ్రం చేసి దేశానికి దిశానిర్దేశం చేయనున్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే, మనం ఆరోగ్యంగా ఉంటామని, గాంధీజీ కూడా పరిశుభ్రతను కోరుకున్నారని కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News