: 'క్లీన్ ఇండియా' ప్రచారకర్తగా అమితాబ్


'బనేగా స్వచ్ఛ్ ఇండియా' ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు. ఇక నుంచి పరిశుభ్ర భారత్ ను తయారు చేయడం కోసం ఆయన ప్రచారం చేస్తారు. ఈ మేరకు ముంబయిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమితాబ్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా పారిశుద్ధ్యంపై ప్రచార కార్యక్రమం చేయాలనుకుంటున్నానని, ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్పారు. తన తండ్రి పరిశుభ్రత విషయంలో ఎంతో కఠినంగా ఉండేవారని బిగ్ బీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో పోలియో నివారణపై అమితాబ్ విశేషరీతిలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం లక్ష్యం... 2019 కల్లా దేశంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం పెంచడమే. ఇందుకోసం ఆర్ బీ సంస్థ రూ. 100 కోట్లు ఖర్చు చేస్తోంది.

  • Loading...

More Telugu News