: వరల్డ్ కప్ వరకు రవిశాస్త్రి కొనసాగింపు
వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ వరల్డ్ కప్ వరకు టీమిండియా కోచింగ్ డైరక్టర్ గా రవిశాస్త్రి కొనసాగనున్నాడు. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రపంచకప్ టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఇటీవలే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన రవి, ఆ సిరీస్ లో మెరుగైన పనితీరు కనబర్చినట్టు బీసీసీఐ వర్గాలు భావించాయి. ఈ క్రమంలోనే ఆయన కాంట్రాక్టును పొడిగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చెన్నైలో జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ప్రకటన చేశారు. ఇంగ్లండ్ తో సిరీస్ సందర్భంగా టీమిండియా సహాయక సిబ్బందిగా కొత్తగా నియమితులైన వారి కాంట్రాక్టును కూడా పొడిగించారు.