: తిరుమలలో పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం
టీడీపీ కార్యకర్తలపై తిరుమలలో పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కొంతసేపటి కిందట తిరుమల చేరుకున్న బాబు, విశ్రాంతి కోసం పద్మావతి అతిథి గృహానికి వెళ్లారు. అక్కడ స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దాంతో, పోలీసులు వారిని అడ్డుకోగా తోపులాట చోటు చేసుకుంది.