: నా భర్తను చంపేందుకు 10 కోట్లు ఖర్చు చేశారు: 'పెద అవుటపల్లి' హతుడి భార్య ఆరోపణ


జేకే ప్యాలెస్ హోటల్ యజమాని దుర్గారావు హత్యతో ఎలాంటి సంబంధం లేకపోయినా తన భర్త, పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారని మృతుడు గంధం నాగేశ్వరరావు భార్య యాదగిరమ్మ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు విగతులుగా మారడంతో తల్లడిల్లిన ఆమె విలపిస్తూ, భూతం దుర్గారావు హత్య కేసులో కేవలం అనుమానించి, తమ వారిపై ఛార్జిషీటు దాఖలు చేశారని ఆమె తెలిపారు. తమ కుటుంబాన్ని మట్టుపెట్టేందుకు సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆమె అన్నారు. ముంబైలో తన మనవడిని హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారని ఆమె చెప్పారు. కృష్ణాజిల్లా పెద అవుటపల్లి వద్ద బుధవారం దారుణ హత్యలు జరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News