: అలిపిరి వద్ద సీఎం కాన్వాయ్ లోని వాహనానికి స్వల్ప ప్రమాదం


తిరుపతిలోని అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ లోని వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని ఇంటెలిజెన్స్ ఐజీ కారును తుడా వైస్ ఛైర్మన్ వాహనం ఢీ కొట్టింది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పన్నెండేళ్ల కిందట ఇదే ప్రదేశంలో చంద్రబాబుపై బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రత చేపట్టారు. అటు, తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

  • Loading...

More Telugu News