: జమ్మూకాశ్మీర్ కు ఇచ్చిన ఆర్థిక సాయం మాకూ ఇవ్వండి: అసోం సీఎం తరుణ్ గొగోయ్
జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకున్న దారుణ వరదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. అదే సహాయాన్ని ఇప్పుడు తమకూ తక్షణ సాయం కింద ఇవ్వాలని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కేంద్రాన్ని కోరారు. ఇటీవల అసోంలోనూ భారీ వర్షాలు కురవడంతో వరదలు వచ్చాయి. దాదాపు 37 మంది చనిపోయారు. పలు జిల్లాలు వరదనీటితో నిండిపోయాయి. ఈ క్రమంలో అటు రాష్ట్రంలో పరిస్థితి గురించి, తీసుకుంటున్న చర్యల గురించి గొగోయ్ ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు. అయితే, అసోంలో పరిస్థితి గురించి స్వయంగా మోడీగానీ, హోంమంత్రిగానీ స్పందించలేదని, తెలుసుకోలేదనీ అన్నారు. నిన్ననే (బుధవారం) రాజ్ నాథ్ మాట్లాడారని చెప్పారు.