: ప్రస్తుత పరిణామాలకు గత ప్రభుత్వాలే కారణం: టీఎస్ మంత్రి ఈటెల


తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు గత ప్రభుత్వాలే కారణమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. విద్యుత్ సమస్యను అధిరోహించేందుకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరులో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2017లోగా కోతలు లేకుండా విద్యత్ సరఫరా చేస్తామని చెప్పారు. వరంగల్ జిల్లాకు హెల్త్ యూనివర్శిటీ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో జనాభాకు తగినంతగా వైద్యులను నియమిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News