: నేటి నుంచి సాయుధ గస్తీ... హైదరాబాద్ పోలీసింగ్ లో మరో ప్రయోగం
హైదరాబాద్ పోలీసింగ్ లో నేటి నుంచి మరో కొత్తదనం చోటు చేసుకోనుంది. దోపిడీ ముఠాలు, ఉగ్రదాడులు, కరడు గట్టిన నేరస్తుల సవాళ్ల నేపథ్యంలో నేటి నుంచి సాయుధ గస్తీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఉదయం నెక్లెస్ రోడ్డులో సాయుధ గస్తీ వాహనాలను తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభిస్తారు. దీంతో, ఆయుధాలతో కూడిన ఇన్నోవా వాహనాలు పోలీసులకు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని 17 ప్రధాన కూడళ్లలో ఈ వాహనాలతో గస్తీని చేపడతారు. రెండు కమిషనరేట్ల పరిధిలో సుశిక్షిత సాయుధ గస్తీ బృందాలు మొత్తం 45 అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ ను సురక్షిత నగరంగా ప్రకటించిన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం సాయుధ గస్తీని అందుబాటులోకి తీసుకువస్తోంది.