: నిండా కష్టాల్లో మునిగి ఈ పాత్ర చేశా: హృతిక్


కెరీర్ లో ఓపక్క ఫెయిల్యూర్స్, మరోపక్క బ్రెయిన్ సర్జరీ, జీవితం నుంచి భార్య వెళ్లిపోవడం వంటి కష్టాలు తనను తీవ్రంగా బాధిస్తున్న సమయంలో 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమాలో పాత్ర చేశానని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తెలిపాడు. తన భార్య సుజానేతో విడిపోవడంతో తాను తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయానని, అదే తనను బలంగా తయారు చేసిందని హృతిక్ స్పష్టం చేశాడు. 'బ్యాంగ్ బ్యాంగ్' తన కెరీర్లో అత్యంత ఉత్తేజకరమైన చిత్రమని హృతిక్ వెల్లడించాడు. గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలాంటి పాత్ర దొరకడం తనకు కొంత రిలీఫ్ ఇచ్చిందని, ఈ సినిమా ప్రయాణం తన వరకు గొప్ప విజయం లాంటిదని హృతిక్ అభిప్రాయపడ్డాడు. సల్మాన్ కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని హృతిక్ తెలిపాడు.

  • Loading...

More Telugu News