: స్పైస్ జెట్ 50 శాతం డిస్కౌంట్ ఆఫర్


విమానయాన సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లతో ప్రయాణికులకు వల వేస్తున్నాయి. అత్యంత చవకైన ప్రయాణం అంటూ ప్రయాణికులను పెంచుకునేందుకు యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా స్పైస్ జెట్ సంస్థ విమాన టిక్కెట్ల బేస్ ధరపై 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్థరాత్రి వరకు బుక్ చేసుకునే టిక్కెట్లపై వర్తిస్తుందని, ఈ ఆఫర్ పై రెండు దశల్లో ప్రయాణాలు ఉంటాయని సంస్థ తెలిపింది. మొదటి దశ 2014 అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 15 వరకు, రెండో దశ 2015 జనవరి 15 నుంచి మార్చి 31 వరకు మాత్రమేనని స్పైస్ జెట్ ప్రకటించింది. ఆఫర్ పై బుక్ చేసిన టికెట్లను రద్దు చేస్తే డబ్బు వాపస్ కానీ, ఇతర మార్పులకు కానీ అవకాశం లేదని స్పైస్ జెట్ ప్రయాణికులకు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News