: విజయ్ మాల్యా ఆ లెక్కలో లేరు!


యునైటెడ్ బ్రూవరీస్ అధినేత విజయ్ మాల్యాను ఫోర్బ్స్ జాబితా కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి తోడు, బకాయిలను తీర్చనందుకు బ్యాంకులు ఆయనను డిఫాల్టర్ గా ప్రకటించాయి. దీంతో విజయ్ మాల్యాను ఫోర్బ్స్ జాబితా లెక్కలోకే తీసుకోలేదు. 2013లో విజయ్ మాల్యా 800 మిలియన్ కోట్ల సంపదతో 84వ స్థానంలో నిలిచారు. 7,600 కోట్ల రూపాయలను మాల్యా 17 బ్యాంకులకు బాకీపడ్డారు. ఈ బాకీల నిమిత్తం 2000 కోట్ల విలువైన షేర్లను స్వాధీనం చేసుకోగా, మరిన్ని ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ఎదురుచూస్తున్నాయి. మాల్యాతో పాటు మరో 11 మందిని జాబితా పరిగణనలోకి తీసుకోలేదని ఫోర్బ్స్ ప్రకటించింది. మాల్యాతో పాటు భూషణ్ స్టీల్స్ అధినేత బ్రిజ్ భూషణ్ సింఘాల్ కుమారుడు ఓ కుంభకోణంలో అరెస్టు కావడంతో ఆయనను కూడా ఫోర్బ్స్ జాబితా పరిగణనలోకి తీసుకోలేదు.

  • Loading...

More Telugu News