: స్మృతి ఇరానీతో భేటీ అయిన గంటా
కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీతో ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐఐఎం, ఎయిమ్స్, ఐఐటీల ఏర్పాటుపై స్మృతితో చర్చించారు. ఈ చర్చలు గంటకు పైగా కొనసాగాయి. ఈ సమావేశానికి గంటాతో పాటు ఎంపీలు రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్, సంబంధిత అధికారులు కూడా హాజరయ్యారు. అనంతరం గంటా మాట్లాడుతూ, మన వినతికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.