: అలుగులు దుంకాలె... చేపలు పట్టాలె: కేసీఆర్
నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే నాలుగైదేళ్ళలో చెరువుల అలుగులు పొంగిపొర్లాలని, ఆ నీటిలో చేపలు పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెరువులు నిండితే రైతులు సిరులు పండిస్తారని అన్నారు. చెరువులు పరిశుభ్రంగా ఉండాలని, పిచ్చి మొక్కలకు తావుండరాదని సూచించారు. చెరువుల్లో పూడికను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. వచ్చే నెలలో చెరువులు, కుంటలు సర్వే చేయాలని... ఈ సర్వేలో అత్యాధునిక పరికరాలను వినియోగించాలని కేసీఆర్ అధికారులకు చెప్పారు.