: మనకు హైవేలు కావాలి, 'ఐ-వే'లు కూడా కావాలి: మోడీ
ప్రభుత్వం దేశంలో హైవేలతో పాటు 'ఐ-వే'లను కూడా కోరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 'ఐ-వే' అంటే 'ఇన్ఫర్మేషన్ వే' అని నిర్వరించారు. దేశ రాజధానిలో 'మేక్ ఇన్ ఇండియా' ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'డిజిటల్ ఇండియా' సాకారం అవ్వాలంటే 'ఐ-వే'లు కూడా అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. మోడీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రసంగిస్తూ, భారత్ ను డిజిటల్ శక్తిగా మార్చేందుకు లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం తెలిసిందే.