: మోడీ రాక కోసం కాలిఫోర్నియా, న్యూజెర్సీల్లో సందడే సందడి
భారత ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం అమెరికాలోని భారతీయులంతా అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఢిల్లీ నుంచి అమెరికా బయల్దేరనున్న మోడీకి ఘన స్వాగతం పలికేందుకు అమెరికాలోని భారతీయులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తమ చేతులపై కమలం గుర్తు, టాటూలు వేయించుకున్నారు. కార్ల నెంబర్ ప్లేట్లపై మోడీ పీఎం అని రాయించుకుంటున్నారు. భారతీయులు అత్యధికంగా నివాసముండే కాలిఫోర్నియా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో సందడి చోటుచేసుకుంది.