: ఒబామా సెల్యూట్ వివాదాస్పదమైంది!


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతిలో కాఫీ కప్పుతో మెరైన్ గార్డ్స్ కు ప్రతి సెల్యూట్ చేయడం వివాదాస్పదమైంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఒబామా న్యూయార్క్ వచ్చారు. హెలికాప్టర్ దిగుతుండగా రక్షణ బాధ్యతల్లో ఉన్న మెరైన్ గార్డ్స్ ఆయనకు సెల్యూట్ చేశారు. చేతిలో కాఫీ కప్పుతో కిందికి దిగిన ఒబామా అదే చేతితో ప్రతి సెల్యూట్ చేశారు. ఇప్పుడదే వివాదాస్పదమైంది. చేతిలో కాఫీ కప్పు పట్టుకుని సెల్యూట్ చేయడం గార్డ్స్ ను అవమానపర్చడమేనని కొందరు అమెరికన్లు ఒబామా చర్యను ఖండించారు. తనకు రక్షణ కల్పిస్తున్న సిబ్బందికి ఆ మాత్రం గౌరవం ఇవ్వలేరా? కాఫీ కప్పును ఎడమ చేతిలోకి తీసుకుని ప్రతి సెల్యూట్ చేయవచ్చు కదా! అంటూ వారు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయి కూర్చుంది.

  • Loading...

More Telugu News