: గత ప్రభుత్వాలు మన ప్రజలను ఇసుమంతైనా నమ్మలేదు: మోడీ
ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలు ప్రజలపై విశ్వాసం ఉంచలేదని మేకిన్ ఇండియా కార్యక్రమంలో మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో ఒక చిన్న ధృవీకరణ పత్రం కోసం కూడా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలనడం శోచనీయంగా ఉందన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కోసం వెళితే... సంతకం వెంటనే కావాలంటే ఇంత, కాస్త లేటుగా కావాలంటే ఇంత అని అన్యాయంగా పేద ప్రజల దగ్గర కూడా లంచం డిమాండ్ చేస్తారని మోడీ ఆవేశంగా ఉన్నారు. మన ప్రజలను మనమే నమ్మకపోతే మరెవరు నమ్ముతారని మోడీ ప్రశ్నించారు. ఈ పరిస్థితిని, ఇలాంటి విధానాలను తాను మారుస్తానని మోడీ పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు ప్రజలు విశ్వాసం ఉంచి అన్ని పనులు సులభంగా అయ్యేలా చేయాలని... ఆ తర్వాత, ప్రజలు ఏదైనా తప్పు చేస్తే అప్పుడు చర్య తీసుకోవాలని మోడీ వ్యాఖ్యానించారు.