: దేశ ప్రజలకు ప్రధాని మోడీ 'నవరాత్రి' శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలకు 'నవరాత్రి' శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అత్యంత పేదలకు సేవచేసే విధంగా తల్లి జగదాంబిక అందరికీ స్పూర్తినివ్వాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. "పవిత్రమైన నవరాత్రి పండుగ మొదలైన సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనమంతా ఆ తల్లి జగదాంబికకు భక్తితో నమస్కరించి ఆశీస్సులు కోరదాం. ఆ తల్లి మన జీవితాలను శక్తితో మరింత సంపన్నం చేయాలని, బాగుండాలని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నా" అని మోడీ సందేశాన్ని పంపారు. దసరా పండుగ నేపథ్యంలో రెండు రోజుల కిందట నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.