: వాళ్ళ కంటే మన శాస్త్రజ్ఞులే భక్తిపరులట!
బ్రిటీష్ శాస్త్రవేత్తల కంటే భారత సైంటిస్టులకే భక్తి ఎక్కువని ఓ అధ్యయనం చెబుతోంది. బ్రిటన్ లోని రైస్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. 65 శాతం బ్రిటీష్ శాస్త్రవేత్తలు మత విశ్వాసాలకు దూరంగా ఉంటారని, అదే, భారత శాస్త్రజ్ఞుల విషయానికొస్తే 6 శాతం మాత్రమే మతాచారాలు పాటించరట. మనవాళ్ళలో భక్తి ఎక్కువేనన్నది దానర్థం. సర్వేలో భాగంగా బ్రిటన్ లో 1581 మంది శాస్త్రవేత్తలను, భారత్ లో 1763 మంది శాస్త్రవేత్తలను పరిశీలించారు. ఈ అధ్యయనానికి బ్రిటన్, భారత్ లనే ఎంచుకోవడానికి గల కారణాలను రైస్ వర్శిటీ సోషియాలజీ ప్రొఫెసర్ ఎలైనే హోవార్డ్ ఎక్లండ్ వెల్లడించారు. చరిత్రపరంగా భారత్, బ్రిటన్ లను విడదీసి చూడలేమని, అదే మతాల విషయానికొస్తే ఎంతో భేదం ఉందని చెప్పారు.