: ఐరాస నివేదికపై కరీనా కపూర్ స్పందన
భారతీయ సినిమాల్లో మహిళల పాత్రల తీరుతెన్నులపై ఐక్యరాజ్యసమితి నివేదిక పట్ల బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్పందించింది. భారతీయ చిత్రాల్లోనే మహిళలను అత్యంత సెక్సీగా చూపుతున్నారని, వారికి మూసపాత్రలే లభిస్తున్నాయని ఐరాస తన నివేదికలో పేర్కొంది. దీనిపై కరీనా మాట్లాడుతూ, వినోదం కోసమే సినిమాలు చూడాలని, వివాదాలకు దూరంగా ఉండాలని తెలిపింది. "తొలినాళ్ళ నుంచీ చీరకట్టులో కనిపించే పాత్రలు పోషిస్తున్నారు, అటు, ఐటెం నంబర్లూ చేస్తున్నారు. వాటిని అందంగా చిత్రీకరించారు. మా తాతయ్య (రాజ్ కపూర్) సినిమా 'రామ్ తేరీ గంగా మైలీ' సినిమాలో మందాకిని శరీరానికి ఓ వస్త్రాన్ని చుట్టుకుని నటించింది. ఆమె ఎంతో అందంగా కనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయం చెబుతున్నారు" అని పేర్కొంది.