: శివసేన తీరుపై మండిపడుతున్న అమిత్ షా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంశం బీజేపీ, శివసేనల మధ్య విభేదాలను రాజేస్తోంది. ఇంకా చెప్పాలంటే పొత్తుపై నీలినీడలు కూడా కమ్ముకున్నాయి. మిత్రపక్షాలకు సీట్లను కేటాయించే అంశంలో ఇరు పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడమే దీనికి కారణం. చిన్న పార్టీలకు 7 సీట్లను కేటాయించాలని ఇరు పార్టీలు తొలుత ఓ నిర్ణయానికి వచ్చాయి. దీనికి చిన్న పార్టీలు ఒప్పుకోలేదు. దీంతో, అదనంగా చెరో 3 సీట్లను చిన్న పార్టీలకు కేటాయిద్దామని బీజేపీ ప్రతిపాదింది. దీనికి శివసేన అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో, శివసేన వ్యవహారశైలిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడుతున్నారు. ముంబయి పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.