: ఎమ్మెల్యే రోజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
చిత్తూరు జిల్లా నగరి శాసనసభ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నగరి జాతరలో తనను కులం పేరుతో దూషించారని టీడీపీ కార్యకర్త రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రోజాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రమేష్ ఫిర్యాదు మేరకు ఇదే కేసులో మరో 13 మందిని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. వీరిలో నగరి మున్సిపల్ ఛైర్మన్ కేజే శాంతి కూడా ఉన్నారు. ఈ కేసు అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.