: మార్నింగ్ వాక్ చేస్తూ కుప్పకూలిన ఐపీఎస్ అధికారి
హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తూ ఐపీఎస్ అధికారి సురేందర్ లాంబా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వాక్ చేస్తున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఉక్కిరిబిక్కిరై కుప్పకూలారు. వెంటనే ఆయన భద్రతా సిబ్బంది సురేందర్ ను యశోదా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.