: నేడు బ్యాంకర్లతో భేటీ కానున్న చంద్రబాబు... రుణమాఫీపై సమీక్ష
ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని నెరవేర్చడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆయన రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాదులోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రుణమాఫీ అర్హతను నిర్ధారించడానికి బ్యాంకులకు ఏపీ ప్రభుత్వం ఓ నమూనాను ఇప్పటికే జారీ చేసింది. ఆ నమూనా ప్రకారం ఎన్ని ఖాతాలు అప్ లోడ్ అయ్యాయి? మిగతా వాటిని పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? అనే అంశాలపై ఈ సమావేశంలో సమీక్షిస్తారు.