: చంద్రబాబుపై అలిపిరి దాడి కేసుపై తీర్పు నేడే
అలిపిరి దాడి కేసుపై నేడు తీర్పు వెలువడనుంది. 2003 అక్టోబర్‌లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద నక్సల్స్ బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి అదనపు సహాయ జిల్లా కోర్టులో ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు సోమవారంతో పూర్తయ్యాయి. అదనపు సహాయ సెషన్స్ న్యాయమూర్తి వెంకటనాగేశ్వరరావు ఈ కేసుకు సంబంధించిన తీర్పును నేడు వెలువరించనున్నారు.