: తెలంగాణాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం... నేటి నుంచి విద్యుత్ కోతలు


తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ తీవ్ర విద్యుత్ సంక్షోభం అలుముకుంది. గత కొన్ని రోజులుగా, తెలంగాణలో కరెంట్ డిమాండ్‌కు, సరఫరాకు మధ్య తీవ్ర అంతరం నెలకొంది. జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇక థర్మల్‌ కేంద్రాలు కూడా సాంకేతిక సమస్యల కారణంగా పాక్షికంగా మాత్రమే పనిచేస్తున్నాయి. బొగ్గు కొరతతో కేటీపీఎస్, ఎన్టీపీసీ, ఆర్టీపీపీలలో పాక్షికంగా మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. బుధవారం నాటికి సుమారు 11 మిలియన్‌ యూనిట్ల లోటు ఉందని తెలంగాణ విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో సోమవారం నుంచే తెలంగాణ వ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలను విద్యుత్తు పంపిణీ సంస్థలు అమలు చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా నేటి నుంచి అధికారికంగా విద్యుత్ కోతలు అమలు కానున్నాయి. వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ పెరగడం కూడా తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా, వ్యవసాయానికి కరెంట్ డిమాండ్‌ వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుందని విద్యుత్ శాఖ అధికారులు భావించారు. అయితే, సెప్టెంబర్‌ రెండో వారం నుంచే వ్యవసాయ విద్యుత్ కు డిమాండ్‌ పెరగడంతో విద్యుత్ శాఖ అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News