: నేడు అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ!


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న మోడీ పర్యటన రేపటి నుంచి మొదలవుతుంది. నేటి సాయంత్రం భారత్ నుంచి బయలుదేరే మోడీ శుక్రవారం మధ్యాహ్నం అమెరికా గడ్డపై కాలుమోపనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా మోడీ, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం అంశాన్ని ప్రస్తావించనున్న మోడీ, హిందీలో తన ప్రసంగాన్ని వినిపించనున్నారు. అనంతరం ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తో భేటీ అయ్యే మోడీ, శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా లతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్పంచుకుంటారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. అయితే ఈ పర్యటనలో ఆయన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భేటీ అయ్యే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అమెరికా పర్యటనలో భాగంగా పలు దేశాధినేతలతో భేటీ అయ్యే మోడీ, అమెరికాలోని ప్రవాస భారతీయులు, పలు దిగ్గజ కంపెనీల అధిపతులతోనూ సమావేశం అవుతారు. ఇదిలా ఉంటే నేటి నుంచి మోడీ, నవరాత్రి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ఉపవాస దీక్షలకు అనుగుణంగానే ఏర్పాట్లు చేయనున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటించింది. ఈ నెల 30న మోడీ, తన అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి భారత్ కు పయనమవుతారు.

  • Loading...

More Telugu News