: లోదుస్తుల్లో 5 కేజీల బంగారం... ఎస్సైల దగ్గర 3.5 కేజీల బంగారం


స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. మధ్య ప్రాశ్చ్య దేశాల నుంచి బంగారం అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో 13.5 కేజీల బంగారం పట్టుబడింది. భద్రతాధికారులే బంగారం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే సమాచారం రావడంతో, అధికారులు నిఘా తీవ్రం చేశారు. ప్రతి ప్రయాణికుడ్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయినా బంగారం పట్టుబడలేదు. దీంతో సీసీ పుటేజీ పరిశీలించగా, ఓ విదేశీయుడితో ఇద్దరు ఎస్ఐలు టాయిలెట్ లోని రహస్య ప్రదేశానికి వెళ్లినట్టు కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు, వారిని పిలిచి ప్రశ్నించగా, వారు తమకేమీ తెలియదని బుకాయించారు. దీంతో ఉన్నతాధికారులు వారి నిర్వాకాన్ని చూపించారు. దీంతో వారిని వెంటబెట్టుకుని టాయిలెట్ లోకి వెళ్లి కోటి రుపాయల విలువైన 3.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి చెన్నైకి చేరుకున్న రామనాధం అనే వ్యక్తి సూట్ కేసు బరువుగా ఉండడంతో తనిఖీ చేశారు. అరకిలో బరువున్న పెద్ద చాక్లెట్లు కనబడడంతో, వాటి రేపర్లను విప్పగా బంగారం అని తేలింది. దాంతో అతని నుంచి 5 కేజీల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో, బెహ్రెయిన్ నుంచి చెన్నై చేరుకున్న గోమతి (50) అనే ఏపీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల్లో 5 కేజీల బంగారం బయటపడింది.

  • Loading...

More Telugu News