: బాబు నిర్ణయం నిరుద్యోగుల పాలిట వరం: ఎల్వీ ఎస్ఆర్కే ప్రసాద్


ఏపీపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని 34 నుంచి 40 ఏళ్లకి పెంచడం నిరుద్యోగులకు వరమని టీడీపీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీ ఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని ఏకంగా ఆరేళ్లు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలని అన్నారు. ఈ సడలింపు 2016 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. సుమారు లక్షకుపైగా ప్రభుత్వోద్యోగాలు అందుబాటులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని భర్తీ చేయలేదని ఆయన విమర్శించారు. వయోపరిమితి పెంచడం ద్వారా యువతకు, అటు ఉద్యోగులకు కూడా న్యాయం చేసినట్టైందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News